వైసిపికి గట్టి ఎదురు దెబ్బ- పంచాయతీ కన్వీనర్‌ బాబు నాయుడు రాజీనామా – నేడు టిడిపి తీర్థం

వైసిపికి గట్టి ఎదురు దెబ్బ- పంచాయతీ కన్వీనర్‌ బాబు నాయుడు రాజీనామా – నేడు టిడిపి తీర్థంప్రజాశక్తి – రామచంద్రాపురం: రామచంద్రాపురం మండలంలోని గణేశ్వర పురం పంచాయతీలో వైసిపికి గట్టి షాక్‌ తగిలింది. పంచాయతీ కన్వీనర్‌ కందల బాబునాయుడు మంగళవారం తన పదవితో పాటు వైసిపికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో ఇమడలేక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం తన అనుచరులతో కలిసి చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, అధికారులకు కతజ్ఞతలు తెలిపారు. టిడిపి చంద్రగిరి నియో జక వర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షం లో బుధవారం తన అనుచరులతో కలిసి టిడిపి తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన తెలిపారు.

➡️