శిల్పారామం వేదికగా బిగ్‌ ఈవెంట్‌

Dec 30,2023 22:20
శిల్పారామం వేదికగా బిగ్‌ ఈవెంట్‌

ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): శిల్పారామం వేదికగా న్యూ ఇయర్‌ వేడుకలు సందర్భంగా ఆదివారం సాయంత్రం బిగ్‌ ఈవెంట్‌ను యోధా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు యోగేష్‌ తెలిపారు. శనివారం ఆయన తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 7గంటల మొదలు అర్థరాత్రి 1గంట వరకు న్యూ ఇయర్‌ వేడుకలు నిర్వహిస్తామన్నారు. అందుకు సంబంధించి పోస్టర్‌ విడుదల చేశారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ”ది గ్లామరస్‌ గాలా బజ్‌” తో తిరుపతి ప్రజలను అలరించడానికి జబర్దస్త్‌ నూకరాజు బందం, బిగ్‌ బాస్‌ సీజన్‌ 6 ఫెమ్‌ ఆర్జె సూర్య ఈవెంట్‌ పోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. లైవ్‌ మ్యూజిక్‌, కేరళ డ్రమ్స్‌, ఫ్యాషన్‌ షో, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కార్యక్రమాలను నిర్విస్తున్నట్లు చెప్పారు. ఎంట్రీ కోసం రూ.1524 చెల్లించాలన్నారు. మరిన్ని వివరాలకు 9133833399నంబర్‌ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో రోహిత్‌, పూర్ణ, ఆసిఫ్‌, అబ్దుల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️