సంస్కృత విశ్వవిద్యాలయంలో నూతన యువ టూరిజం క్లబ్‌ ప్రారంభం

Jan 24,2024 23:14
సంస్కృత విశ్వవిద్యాలయంలో నూతన యువ టూరిజం క్లబ్‌ ప్రారంభం

ప్రజాశక్తి – క్యాంపస్‌: భారత ప్రభుత్వ పర్యాటక, సాంస్కతిక మంత్రిత్వశాఖ ఆదేశాలను అనుసరించి జాతీయ సంస్కత విశ్వవిద్యాలయంలో యువ టూరిజం క్లబ్‌ని ప్రారంభించడం జరిగింది. ఈ టూరిజం క్లబ్‌ ద్వారా భారతదేశం హెరిటేజ్‌ కల్చర్‌, వారసత్వ సంపద ఏదైతే ఉందో వాటిపైన యువకులకు ప్రత్యేకంగా తెలియజేసి, తద్వారా భారతదేశ సంస్కతి, సాంప్రదాయాలను యువత సంరక్షించాలనే సదుద్దేశంతో ఈక్లబ్‌ను ప్రారంభించడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ భారతి, ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌, తిరుపతి హబ్‌రీజనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.రమణ ప్రసాద్‌ విచ్చేసి, విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్లర్‌ ప్రొఫెసర్‌ జిఎస్‌.ఆర్‌ కష్ణమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. అనంతరం ముఖ్యఅతిథులు ప్రొఫెసర్‌ డి.భారతి మాట్లాడుతూ పర్యాటకం ద్వారా మనకు ఎంతో విశేష జ్ఞానం వస్తుందని, ప్రత్యేకించి యువత భారతదేశంలో ఉన్నటువంటి అనేక వారసత్వ స్థలాలు, ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి గొప్పతనాన్ని తెలుసుకొని ముందుకు సాగాలనేటువంటి సదుద్దేశంతో ఈనూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వర్ణించారు. విద్యార్థులందరూ ఈటూరిజం క్లబ్‌ ద్వారా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అకాడమిక్‌ డీన్‌ ప్రొఫెసర్‌ టివి.రాఘవాచార్యులు, రిజిస్ట్రార్‌ ఇన్చార్జ్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.రమణప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️