సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల ర్యాలీ

సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల ర్యాలీప్రజాశక్తి -తిరుపతి టౌన్‌సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పాత కార్యాలయం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సిఐటి నాయకులు టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వీరి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత విస్మరించడం దారుణమన్నారు. సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగులతో ప్రభుత్వం ఆటలాడుతుందని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని, వారి ద్వారా వెట్టిచాకిరీ చేయించుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. వీరి సమ్మెకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి వీరి సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు నగర నాయకులు వేణు, ఎస్‌ ఎస్‌ ఏ యూనియన్‌ నేతలు మాధవయ్య, వాసవి, మోహన్‌, ధనపాల్‌, జనార్ధన్‌, లలిత, ప్రసాద్‌, ప్రశాంత్‌, శివ, వేణు,రమణ,నవీన్‌ పాల్గొన్నారు. ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు గంటా మోహన్‌, ఉపాధ్యాయ వాణి సంపాదకులు గాజుల నాగేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు.

➡️