సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల ధర్నా

సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల ధర్నా

సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల ధర్నాప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగులు సమ్మెలో భాగంగా బుధవారం తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు.ఆర్డీవో స్పందిస్తూ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు. ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు గండికోట నాగ వెంకటేష్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఎస్‌ఎస్‌ఐ ఉద్యోగులను రెగ్యులర్‌చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సుప్రీం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సూర్యకుమారి, నాయకులు చరణ్‌, కంచి మాధవయ్య, ప్రదీప్‌కుమార్‌, మునిక్రిష్ణయ్య, సురేష్‌, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.

➡️