స్కూలు బస్సు ఢీకొని వ్యక్తి మృతి

స్కూలు బస్సు ఢీకొని వ్యక్తి మృతిప్రజాశక్తి-తొట్టంబేడు ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన దుర్ఘటన సోమవారం పెద్ద సింగమాల గ్రామంలో చోటుచేసుకుంది. టూ టౌన్ సీఐ రారాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్ద సింగమాల గ్రామానికి చెందిన వీరరాఘవులు(46) అదే గ్రామానికి సమీపంలో ఓ చెట్టుకింద ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెలపై సేదతీరుతున్నాడు. ఈ క్రమంలో స్కూల్ పిల్లలను ఇంటికి తీసుకొస్తున్న ఓ ప్రయివేట్ బస్సు అదుపుతప్పి సిమెంట్ దిమ్మెలపై సేదదీరుతున్న వీర రాఘవులను వేగంగా ఢీ కొంది. ఈ ఘటనలో వీర రాఘవులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గ్రామస్తుల సమాచారం మేరకు టూటౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️