‘స్పందన’ సమస్యలన్నీ పరిష్కరించాలి

'స్పందన' సమస్యలన్నీ పరిష్కరించాలి

‘స్పందన’ సమస్యలన్నీ పరిష్కరించాలి స్పందన కార్యక్రమంలో అర్జీలు స్వీకరిస్తున్న కమిషనర్‌ హరితప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎక్కువమంది సమస్యలపై కమిషనర్‌ హరితకు వినతిపత్రం ఇచ్చారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రజలు డయల్‌ యువర్‌ కమిషనర్‌, స్పందన కార్యక్రమాల్లో ఇచ్చే అన్ని పిర్యాధులకు తగిన పరిష్కారం చూపించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో సోమవారం డయల్‌ యువర్‌ కమిషనర్‌, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో కమిషనర్‌ అర్జీలను స్వీకరించారు. సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమానికి 17, స్పందన కార్యక్రమానికి 40 పిర్యాధులు, అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో ఉపకమిషనర్‌ చంద్రమౌళీశ్వర్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ మోహన్‌, మునిసిపల్‌ ఇంజనీర్‌ వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారి సేతుమాధవ్‌, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ యువ అన్వేష్‌ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్‌ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ బాలసుబ్రమణ్యం, వెటర్నరీ ఆఫీసర్‌ డాక్టర్‌ నాగేంద్రరెడ్డి, మేనేజర్‌ చిట్టిబాబు, డీఈలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

➡️