108 వాహనంలో గర్భవతి మృతి

108 వాహనంలో గర్భవతి మృతి

108 వాహనంలో గర్భవతి మృతిప్రజాశక్తి -కే వి బి పురం (తిరుపతి జిల్లా)తిరుపతి జిల్లా కేవిబి పురం మండలంలోని రంగయ్యగుంట పంచాయతీకి చెందిన తిమ్మి నాయుడు గుంట గిరిజన కాలనీకి చెందిన ఏ.చెంచురామయ్య భార్య ఏ.చెల్లమ్మ (29) గురువారం మృతిచెందింది. చెల్లమ్మ ఎనిమిదో నెల గర్భవతి. గురువారం వాంతులు కావడంతో 108 సాయంతో శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందినట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వడదెబ్బతో మృతిచెందిన చెల్లమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చెల్లమ్మకు రెండు సంవత్సరాల కొడుకు ఉన్నాడు. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేస్తూ ఉంటారు. ఈతాకు తేవడం, చుట్టుపక్కల పొలాల్లో పనులకు వెళ్లడం వల్ల వడదెబ్బతో చెల్లమ్మ చనిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు.

➡️