తొలిసారి తలుపు తట్టిన హోం బ్యాలెట్‌పండుటాకుల్లో ‘ప్రత్యేక’ ఆనందంబిఎల్‌ఒల నిర్లక్ష్యంతో 12శాతమే అర్హులట1255కి కేవలం 149మందే వినియోగంచంద్రగిరిలో ఏమిటీ ‘అనర్హత’ రాజకీయం

తొలిసారి తలుపు తట్టిన హోం బ్యాలెట్‌పండుటాకుల్లో 'ప్రత్యేక' ఆనందంబిఎల్‌ఒల నిర్లక్ష్యంతో 12శాతమే అర్హులట1255కి కేవలం 149మందే వినియోగంచంద్రగిరిలో ఏమిటీ 'అనర్హత' రాజకీయం

తొలిసారి తలుపు తట్టిన హోం బ్యాలెట్‌పండుటాకుల్లో ‘ప్రత్యేక’ ఆనందంబిఎల్‌ఒల నిర్లక్ష్యంతో 12శాతమే అర్హులట1255కి కేవలం 149మందే వినియోగంచంద్రగిరిలో ఏమిటీ ‘అనర్హత’ రాజకీయంప్రజాశక్తి -రామచంద్రాపురంఅనారోగ్యం, వద్ధాప్యం, అంగవైకల్యంతో మంచాన పడి మగ్గుతున్న బెడ్‌ రెస్టెడ్‌ రోగుల కోసం, 85 సంవత్సరాలు పైబడిన ముదుసలికి హోంఓటు విధానాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఎన్నికల బ్యాలెట్‌ పండుటాకుల మంచాన్ని తాకింది. ఈనెల 7వ తారీఖున చంద్రగిరి నియోజకవర్గంలో హోం ఓటింగ్‌ ప్రక్రియను ఎన్నికల అధికారులు సజావుగా నిర్వహించారు. చంద్రగిరి నియోజకవర్గంలో రామచంద్రాపురం, చంద్రగిరి, పాకాల, తిరుపతి రూరల్‌, చిన్న గొట్టిగల్లు, యర్రావారిపాలెం మండలాల్లో 85 సంవత్సరాలు వయసు నిండిన వద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులు, దీర్ఘకాలిక వ్యాధులతో 149 మంది ఓటర్లు హౌం ఓటును సద్వినియోగం చేసుకున్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కునువేస్తామో…. వేయలేమేమోనని….యోచనలో ఉన్న కొంతమంది దిగ్భ్రాంతికి గురయ్యారు. మరి కొంతమంది ఎలాగైనా ఈసారీ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తహతహలాడారు. అనారోగ్యంతో చావు బతుకుల్లో మంచాన ఉన్నప్పటికీ….. ప్రజాస్వామ్య పరిరక్షణకు ‘నా ఓటే……ప్రధానం’ కావాలనే ఆశతో ఉన్న బెడ్‌ రెస్టెడ్‌ ఓటర్ల ఆశయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నెరవేర్చింది. అయితే చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం 1255 మంది అర్హులు ఉండగా, కేవలం 149 మందినే అర్హులను చేస్తూ, మిగిలిన వారిని అనర్హులుగా ప్రకటించడంలో బిఎల్‌ఒల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 85 సంవత్సరాలు వయస్సు నుండి వద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులు, బెడ్‌ రెస్టెడ్‌ పేషెంట్లు సుమారు 1255మంది ఉన్నారని స్వయంగా జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. కానీ స్థానిక బిఎల్వోలు వారికి హౌమ్‌ ఓటింగ్‌ కల్పించడంలో నిర్లక్ష్యం చూపారన్న ఆరోపణలున్నాయి. హౌమ్‌ ఓటింగ్‌ అర్హులైనప్పటికీ బి ఎల్‌ వో లు, రెవెన్యూ అధికారులు ఇంటి వద్దకు వెళ్లి వారి నుండి తమకు హౌం ఓటింగ్‌ వద్దని తెల్ల కాగితంపై రాయించి, వారి దగ్గర సంతకాలు చేసుకుని అనర్హులుగా చేశారని కొంతమంది వద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులు, బెడ్‌ రెస్టెడ్‌ పేషెంట్లు బహిరంగంగానే బిఎల్‌ఓలపై విమర్శలు చేస్తున్నారు.ఎన్నికల కమిషన్‌కు కృతజ్ఞతలు ఎ.కృష్ణయ్య, తిమ్మరాజుపల్లి, ఆర్‌సిపురంనా పేరు ఎ.కష్ణయ్య, నా వయస్సు 92 సంవత్సరాలు. నేను మంచానికి పరిమితమయ్యాను. నా ఓటును 2024 ఎన్నికల్లో వేస్తానో….. వేయలేనో అని బాధపడేవాడిని. కేంద్ర ఎన్నికల కమిషన్‌ మాలాంటి వారి వారికోసం అధికారులను మంచం దగ్గరికి పంపి మా ఓటు హక్కు వినియోగించుకునేలా చేసినందుకు ఎన్నికల సంఘానికి కతజ్ఞతలు.ఈసారి కష్టం తప్పింది : లక్ష్మమ్మ, కొత్తవేపకుప్పం నా పేరు లక్ష్మమ్మ, నేను దీర్ఘకాలిక వ్యాధితో మంచంలోనే ఉన్నాను. నేను ఓటు హక్కు వినియోగించుకునేందుకు గతంలో అయితే మంచంలో మోసుకుని వెళ్లడమో, చక్రాల కుర్చీ నెట్టుకునో వెళ్లాల్సి వచ్చేది. అధికారులు నా దగ్గరకు వచ్చారు. ఓటు వేయమన్నారు…. ఓటు వేసేసాను. నా కోరిక తీరింది.ఓటు వజ్రాయుధం: గురమ్మ, ప్రత్యేక ప్రతిభావంతురాలు, కమ్మకండ్రిగనా పేరు గురమ్మ, మాది కమ్మ కండ్రిగ గ్రామం. నేను ప్రత్యేక ప్రతిభావంతురాలిని. రెండు కాళ్లు పనిచేయవు. మంచానికే పరిమితం….. నడిచి పోలింగ్‌ కేంద్రానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది… ఈసారి ఎన్నికల అధికారులు ఇంటి వద్దకే వచ్చి నాకు ఓటును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. చాలా ఆనందంగా ఉంది.ఇంట్లోనే ఓటేయడం ఆనందంగా ఉంది జానకమ్మ, ఎన్‌ఆర్‌ కమ్మపల్లినా పేరు జానకమ్మ. నా వయసు 98 సంవత్సరాలు. వద్ధాప్యంతో మంచంలో మగ్గుతున్నాను. అధికారులు మా ఇంటికి వచ్చి నాకు ఓటు కాగితాన్ని ఇచ్చి ఓటు వేయించారు. నా ఓటు వధా కాకుండా సద్వినియోగం చేసుకున్నాను.. నాకు సంతోషంగా ఉంది.

➡️