తిరుమలలో చంద్రబాబు కుటుంబంనేటి ఉదయం శ్రీవారి దర్శనం

తిరుమలలో చంద్రబాబు కుటుంబంనేటి ఉదయం శ్రీవారి దర్శనం

తిరుమలలో చంద్రబాబు కుటుంబంనేటి ఉదయం శ్రీవారి దర్శనంప్రజాశక్తి – తిరుమల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార ఘట్టం ముగిసిన వెంటనే నారా చంద్రబాబునాయుడు కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బుధవారం రాత్రి విచ్చేశారు. భార్య భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్‌, కోడలు బ్రహ్మణి, మనవడు దేవాన్ష్‌తో పాటు నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు వీరితో పాటు ఉన్నారు. టిటిడి ఈవో ఎవి ధర్మారెడ్డి సెలవులో ఉన్న నేపథ్యంలో టిటిడి జెఈవో వీరబ్రహ్మం వీరికి ఘనంగా స్వాగతం పలికారు. సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కుటుంబంతో కలిసి మొదటి పర్యటనగా తిరుమలకు విచ్చేశారు. టిడిపి శ్రేణులతో తిరుమలలో ఆప్యాయంగా పలకరించారు. గాయత్రి నిలయంలో రాత్రి బస చేయనున్నారు. గురువారం ఉదయం 7.15 గంటలకు కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరిగి రాజధాని అమరావతికి చేరుకుంటారు. తిరుమల చేరుకున్న సమయానికి వర్షం పడుతుండడంతో కుటుంబీకులందరూ గొడుగుల్లో బస కేంద్రాలకు వెళ్లడం కనిపించింది. చంద్రబాబుకు ఘన స్వాగతం నారా చంద్రబాబునాయుడుకు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బుధవారం రాత్రి 7.35 గంటలకు కుటుంబ సమేతంగా చేరుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, మంత్రి నారా లోకేష్‌కు ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎండోమెంట్స్‌ కరికాల వలనన్‌, డిఐజి షిమోషి, తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు ప్రవీణ్‌కుమార్‌, షన్మోహన్‌, తిరుపతి ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు, ఎంఎల్‌ఎలు బొజ్జల సుధీర్‌రెడ్డి, పులివర్తి నాని, ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు జెసి శ్రీనివాసులు, టిటిడి జెఇఒ గౌతమి, తిరుపతి మున్సిపల్‌ కమిషనర్‌ అదితిసింగ్‌, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్‌ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో తిరుమల శ్రీవారి దర్శనార్ధం బయల్దేరి వెళ్లారు. పర్యటనకు భారీ బందోబస్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి, తిరుమల పర్యటన సందర్భంగా డిఐజి షిమోషి బాజ్‌ పారు ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్‌ రాజు, తిరుపతి జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌, చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ నరసింహాకిషోర్‌ సంయుక్తంగా కాన్వారు రిహార్సల్‌ నిర్వహించారు. 1550మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకట్రావు, కులశేఖర్‌, విమల కుమారి, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్ముడు రిజర్వ్‌,ఎస్బ్‌ డీస్పీ వేంకటాద్రి, రేణిగుంట డిఎస్పి భవ్య కిషోర్‌ పాల్గొన్నారు.

➡️