చైతన్యపురంలో ఏనుగుల బీభత్సం

Apr 6,2024 23:49

చైతన్యపురంలో ఏనుగుల బీభత్సంప్రజాశక్తి – రేణిగుంట తిరుపతి సమీపంలోని రేణిగుంట మండలం చైతన్యపురంలో ఏనుగుల బీభత్సం అన్నదాతలను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా, కన్నీరు పెట్టిస్తోంది. చైతన్యపురం గ్రామంలో ఏకంగా 15 ఏనుగులు సంచరించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల బీభత్సంతో పంటపొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మామిడి పంటపై ఆధారపడ్డ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 80 ఎకరాల్లో మామిడి తోటలు ధ్వంసమయ్యాయని రైతులు వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో రాత్రుల్లో పంటలను రక్షించుకోడానికి ప్రాణాలకు తెగించి తమ వద్ద ఉన్న బాణసంచాను పేల్చి ఏనుగులను తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఎలాంటి లాభం లేకుండా పోయిందని, అలవాటు పడిన ఏనుగులు పొలాల్లోకి వస్తూనే ఉన్నాయన్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.

➡️