వైభవంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం23న పౌర్ణమి గరుడసేవ రద్

వైభవంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం23న పౌర్ణమి గరుడసేవ రద్

వైభవంగా శ్రీవారికి స్నపన తిరుమంజనం23న పౌర్ణమి గరుడసేవ రద్దుప్రజాశక్తి- తిరుమల తిరుమలలోని వసంతోత్సవ మండపంలో శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 నుండి 4గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఆతరువాత స్వామి, అమ్మవార్లు సాయంత్రం అక్కడినుండి బయల్దేరి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌ స్వామి, ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.23న పౌర్ణమి గరుడసేవ రద్దు శ్రీవారి ఆలయంలో ఈనెల 23వ తేదీన పౌర్ణమి గరుడసేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విధితమే. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు జరుగుతున్న కారణంగా పౌర్ణమి గరుడసేవ రద్దు అయ్యింది.

➡️