లికాలుష్యం కోరల్లో గ్రామాలు లిమెగా కంపెనీ డంపింగ్ యార్డు వద్ద గ్రామస్తుల ధర్నా పోలీసుల రంగ ప్రవేశం

లికాలుష్యం కోరల్లో గ్రామాలు లిమెగా కంపెనీ డంపింగ్ యార్డు వద్ద గ్రామస్తుల ధర్నా లిపోలీసుల రంగ ప్రవేశం ప్రజాశక్తి -తొట్టంబేడు ఆరు లైన్ల రోడ్లు పనులను మెగా కంపెనీ చేపట్టిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో రోడ్డు నిర్మాణ పనులకు కావలసిన మెటీరియల్స్ ను మండలంలోని లింగమ నాయుడు పల్లి గ్రామ సమీపంలో ఓ పెద్ద డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. దీన్ని పరిశీలిస్తే అందరూ అవాక్కవ్వాల్సిందే ఓ పెద్ద క్వారీ పక్కనే రోడ్డు పనులకు ఉపయోగించే భారీ డంపింగ్ యార్డు ఉన్నాయి. ఇక్కడ కంకర క్రషర్ మట్టి పెద్ద ఎత్తున ఉంటాయి. ఇక్కడ నుంచే రోడ్డు పనులను ఉపయోగించి మొత్తం మెటీరియల్ సప్లై చేస్తారు. అయితే ఇక్కడ ఉన్న క్వారీని పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈ క్వారీలో కంప్రెసర్ తో చేయాల్సిన పనులను పవర్ బోర్డ్ తో చేయడంతో లింగమ నాయుడు పల్లి, గుమ్మడి గుంట, దొమ్మరపాలెం, క్రైస్తవ మిట్ట, కురవకన్నేరి, మల్లిగుంట , రౌతు సూరమాల భవానీ శంకరాపురం గ్రామాల్లో క్వారీల్లో జరిగే బ్లాస్టింగ్ వల్ల పై గ్రామాల్లో ఇల్లు బీటలు వారుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. పలుమార్లు విన్నవించిన కంపెనీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో మంగళవారం మెగా కంపెనీ డంపింగ్ కేంద్రం వద్ద గ్రామస్తులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇక్కడ నుంచి వచ్చే కాలుష్యంతో తమ అనారోగ్యాల బారిన పడ్డామన్నారు.కాలుష్యం వల్ల రైతులు వేసిన పంటలకు తెగుళ్లు సోకడంతో పాటు వరి కోతలు కోసే సమయంలో పంట పొలాల్లో నుంచి దుమ్ము అలాగే రావడం కనిపిస్తోంది ధాన్యం షైనింగ్ రాకపోవడంతో రైతులకు మద్దతు ధర లేదు నష్టాలతో దాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొందరు ప్రజలు కాలుష్యంతో మృతి చెందడంతో పాటు కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఓ చిన్నారి అముద(8) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందన్నారు. పోలీసుల రంగప్రవేశం మెగా డంపింగ్ యార్డ్ వద్ద ధర్నా జరుగుతోందని తెలుసుకున్న తొట్టంబేడు ఎస్సై రాఘవేంద్ర తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కానీ ఇలా వాహనాలు ఆపడం సబబు కాదని ఎన్నికల కోడ్ ఉందని అన్నారు ధర్నా చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించేశారు కోడ్ నేపథ్యంలో ధర్నాలు చేస్తే కేసులో నమోదు చేస్తామని హెచ్చరించారు. లికిడ్నీలు వ్యాధితో బాధపడుతున్న మనోజ్ కిడ్నీలు వ్యాధి సోకి ఇబ్బంది పడుతున్నారని మనోజ్ తెలిపారు. సోమవారం రాత్రి కూడా ఇబ్బంది కలగడంతో శ్రీకాళహస్తి పట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి వస్తున్నారని వాపోయాడు.లిదుమ్ము భరించలేకపోతున్నాం పాపయ్య గాలితో వెళ్ళినప్పుడు మా గ్రామం వైపు అధికంగా తుమ్ము వస్తుంది రోడ్డుమీద వెళ్లాలంటే కూడా కళ్ళు కనిపించకుండా పోతున్నాయి దీంతో రోగాల బారిన పడుతున్నమన్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బాంబులు పేలుస్తున్నారు. ఆ శబ్దాలకు ఇంటిలో ఉన్న వస్తువులకు కదలకి వచ్చి పడిపోతున్నాయి అన్నారు.లిధాన్యం కొనుగోలు చేయట్లేదు రామకృష్ణయ్యక్రసర్ నుంచి వచ్చే దుమ్ము ఊరి పేరు మీద పడి పేరుకుపోతుంది దీంతో ధాన్యం షైనింగ్ రాక దళారులు కొనట్లేదు అన్నారు. పైరు కోసేటప్పుడు దుమ్ము ఎక్కువగా పంట మీద ఉంటుందన్నారు.గ్రామంలో సుమారు 20 మందికి కిడ్నీ వ్యాధి సోకిందన్నారు. పదిమందికి పైగా ఆపరేషన్ జరిగిందన్నారు ఇలా ఉంటే మా గ్రామం నుంచి వలస వెళ్లాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

➡️