5,6 తేదీల్లో..సద్వినియోగం చేసుకోండి : ప్రవీణ్‌కుమార్‌

5,6 తేదీల్లో..సద్వినియోగం చేసుకోండి : ప్రవీణ్‌కుమార్‌

5,6 తేదీల్లో..సద్వినియోగం చేసుకోండి : ప్రవీణ్‌కుమార్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి, అత్యవసర శాఖలో పనిచేసే ఉద్యోగులకు, అత్యవసర సర్వీసుల శాఖలు, వీడియోగ్రాఫర్లు, డ్రైవర్లు ఎవరైతే నిర్ణీత దరఖాస్తులు గడువులోపు ఫారం 12, 12డి సమర్పించిన వారు ఫెసిలిటేషన్‌ కేంద్రానికి వెళ్లి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని 5, 6 తేదీల్లో వినియోగించు కోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఏ నియోజక వర్గంలో అయితే ఓటు ఉంటుందో ఆ నియోజక వర్గం ఫెసిలిటేషన్‌ సెంటర్‌ నందు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం వినియోగించుకోవాలని పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో ఎలెక్షన్‌ విధులు నిర్వహిస్తూ పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ఇతర జిల్లాల ఓటర్లు ఎస్‌.వి.యు. క్యాంపస్‌ హై స్కూల్‌, తిరుపతి నందు పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని వినియోగించు కోవచ్చునని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకునేవారు విధిగా ఎపిక్‌ ఐడి కార్డు, ఆధార్‌కార్డు, ఎన్నికల విధులకు కేటాయిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల కాపీలను తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. నియోజకవర్గాల వారీగా..గూడూరు (ఎస్సీ) జడ్‌పి బార్సు హైస్కూల్‌, గూడూరుసూళ్లూరుపేట (ఎస్సీ) విఎస్‌ఎస్‌సి గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజి, సూళ్లూరుపేటవెంకటగిరి విశ్వోదయ గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజి, వెంకటగిరిచంద్రగిరి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ హ్యుమానిటీస్‌ బ్లాక్‌1తిరుపతి ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజి, తిరుపతిశ్రీకాళహస్తి స్కిట్‌ కాలేజీ, శ్రీకాళహస్తి సత్యవేడు (ఎస్సీ) ఎంపిడిఒ ఆఫీసు, సత్యవేడు

➡️