‘ఆస్టర్‌’లో మెగా హెల్త్‌ క్యాంప్‌

Apr 7,2024 22:50
'ఆస్టర్‌'లో మెగా హెల్త్‌ క్యాంప్‌

ప్రజాశక్తి- తిరుపతి సిటీ: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆస్టర్‌ నారాయణాద్రి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించారు. స్థానిక రేణిగుంట రోడ్డులోని ఆస్టర్‌ నారాయణ హాస్పిటల్‌లో జరిగిన కార్యక్రమంలో హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సునంద కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యం పట్ల భాద్యత వహించి ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. కొత్త జబ్బులపై ప్రజలు అవగాహన కలిగి ఉండి, జాగ్రత్తలు పాటించాలన్నారు. మరో డైరెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌వి.ప్రసాద్‌ మాట్లాడుతూ అందరు ఆరోగ్య పరిస్థితుల గురించి క్రమం తప్పకుండా తెలుసుకోవడం వలన తొందరగా వ్యాధి నుంచి కోలుకోవచ్చని తెలిపారు. జనరల్‌ ఫిజిషన్‌ డాక్టర్‌ పిఎస్‌.నాయుడు మాట్లాడుతూ ప్రజలకు సేవలందించడానికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు ఆస్టర్‌ నారాయణాద్రి హాస్పిటల్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఆర్‌.సజన మాట్లాడుతూ నిత్యవ్యాయామాల పైన శ్రద్ధ వహించడం వలన ఆరోగ్యమైన జీవితాన్ని గడపగలరని తెలిపారు. ఆసుపత్రి చీప్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ ముని మాట్లాడుతూ ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు సేవలు అందించడంలో ఆస్టర్‌ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా అత్యంత అధునాతమైన పరికరాలతో ప్రపంచ దేశాలలో మెరుగైన వైద్యసేవలను ఆస్టర్‌ అందిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పలువురు రోగులకు ఉచితంగా వైద్య సేవలు మందులు పంపిణీ చేశారు.

➡️