మండే ఎండ.. ఉపాధికేదీ అండ..కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించని అధికారులుపనిప్రదేశాల్లో టెంట్‌, మంచినీరు,సౌకర్యాలు నిల్‌కూలీలకు అందని పరికరాలు

మండే ఎండ.. ఉపాధికేదీ అండ..కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించని అధికారులుపనిప్రదేశాల్లో టెంట్‌, మంచినీరు,సౌకర్యాలు నిల్‌కూలీలకు అందని పరికరాలు

మండే ఎండ.. ఉపాధికేదీ అండ..కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించని అధికారులుపనిప్రదేశాల్లో టెంట్‌, మంచినీరు,సౌకర్యాలు నిల్‌కూలీలకు అందని పరికరాలు ప్రజాశక్తి – బాలాయపల్లి: మండుతున్న ఎండల్లోనే పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు అవస్థలు తప్పడం లేదు. కనీస సౌకర్యాలైన నీడు, నీరు కూడా లేకపోవడంతో కూలీలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉపాధి పనులు జరిగే ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు మాత్రం ఉదయాన్నే వెళ్లి ఉష్ణోగ్రతలు పెరిగేలోపు పనులు ముగించుకొని రావాలని చెబుతున్నారు. అలాగైతే రోజుకూలి గిట్టుబాటు కాదని కూలీలు అంటున్నారు.ఎండలకు గడ్డపారలు, సామగ్రి వేడెక్కి చేతులు బొబ్బలు వస్తున్నాయి. మార్చి నుంచి జూన్‌ రెండో వారం వరకు ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ సమయంలో కూలీలకు ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తగిన వసతులు కల్పించాలి. వడదెబ్బ తగలకుండా గుడారాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ తిరుపతి జిల్లాలో ఎక్కడా ఇలాంటి చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఎండల కారణంగా కూలీలు వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది.అందని పరికరాలు..ఉపాధి హామీ పథకం పనులు చేసే కూలీలకు ప్రభుత్వమే పరికరాలు అందించేది. గడ్డపారలు, పారలు, ఇనుప తట్టలు, జంగిల్‌ కటింగ్‌ కోసం గొడ్డళ్లు, కొడవళ్లు ఇచ్చేవారు. క్రమక్రమంగా అధికారులు పరికరాలను ఇవ్వడం కూడా మానేశారు. ప్రభుత్వం నుంచే రావడం లేదని చెబుతున్నారు. దీంతో కూలీలే పరికరాలు సొంతంగా కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసింది. దీనిలో వేసవి భత్యం ప్రస్తావన లేకపోవడంతో ఈ ఏడాది నుంచి కూలీలు వేసవి భత్యానికి కూడా నోచుకోకుండా పోయారు. తాగునీటి సదుపాయం కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మండుటెండలో మాడాల్సిందేనా?వేసవి ఎండలు మండుతున్నాయి. ఉపాధి హామీ కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పనిచేసేచోట సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు మాత్రం ఉదయాన్నే వెళ్లి ఉష్ణోగ్రతలు పెరిగేలోపు పనులు ముగించుకొని రావాలని చెబుతున్నారు.తాగునీటికి రూ.5లు ఎక్కడా..ప్రభుత్వం కూలీలకు తాగునీటి సీసాలు తెచ్చుకోవడం కోసం గతంలో రోజుకు రూ.5లు అదనంగా చెల్లించేది. ఈ సంవత్సరం నుంచి వాటిని కూడా ఎత్తేశారు. ఇక కూలీలకు మజ్జిగ అందించడంలో జాప్యం. అధికారులు స్పందించి వేసవి ఎండలను దష్టిలో పెట్టుకొని పనిచేసే చోట తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించాలని ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు.గుడారాల జాడేలేదు…ఉపాధి హామీ కూలీలు పనిచేసి ఎండలకు అలసిపోతే కాసేపు సేద తీరడానికి, మధ్యాహ్నం భోజన సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి అవసరమైన గుడారాలను ప్రభుత్వమే గతంలో పంపిణీ చేసింది. వాటిని క్షేత్ర సహాయకులు పనిచేసే చోటుకు తీసుకెళ్లి కూలీలకు నీడకోసం గుడారం వేయించేవారు. అయితే ప్రభుత్వం రెండేళ్ల కిందట క్షేత్ర సహాయకులను విధులను నుంచి తొలగించి.. తరవాత మళ్లీ తీసుకుంది. అయితే గతంలో ఇచ్చిన గుడారాలు ఏమయ్యాయో క్షేత్ర సహాయకులకే తెలియడం లేదు. అలాగే పనిచేసే చోట కూలీలకు గాయాలైతే ప్రథమ చికిత్స కోసం మెడికల్‌ కిట్లు ఇచ్చారు. అందులో గాయాలకు కట్టుకట్టడానికి మందులు, దూది, బ్యాండేజ్‌ ఉండేది. వడదెబ్బకు గురైన వారికి తాగించడానికి ఓఆర్‌ఎస్‌ పాకెట్లు ఉండేవి. ఆ కిట్ల జాడ లేకుండా పోయింది. 2015-16వ సంవత్సరంలో మెడికల్‌ కిట్లు ఇచ్చారు. తరవాత వాటి పంపిణీని విస్మరించారు.సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్తాం..- అరుణ, ఎంపిడిఓ, బాలాయపల్లి

➡️