ఇండియా బాడీ బిల్డింగ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షులుగా ప్రవీణ్‌

ఇండియా బాడీ బిల్డింగ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షులుగా ప్రవీణ్‌

ఇండియా బాడీ బిల్డింగ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షులుగా ప్రవీణ్‌ ప్రజాశక్తి -తిరుపతి సిటీ ఇండియా బాడీ బిల్డింగ్‌ ఫెడరేషన్‌ జాతీయ అధ్యక్షులుగా తిరుపతికి చెందిన ఎలమంచిలి ప్రవీణ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఆ సంఘం సర్వసభ్య సమావేశం సందర్భంగా ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికలు పరిశీలకులుగా మస్కట్‌ దేశం నుండి షకీల్‌ నలాకట్‌ విచ్చేసి సర్వసభ్య సమావేశాన్ని, ఎన్నికలను నిర్వహించారు. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు, అధ్యక్ష, కార్యదర్శులు విచ్చేసి కొత్త కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గం 2024 నుండి 2028 వరకు కొనసాగనుంది. ప్రవీణ్‌ మాట్లాడుతూ ఇప్పటివరకు దాదాపు 206 ఆర్గనైజేషన్లలో సేవ చేసే భాగ్యం తనకు దొరికిందని, కొత్తగా గోల్డెన్‌ ఇండియా బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ కార్యవర్గం తనను ఎన్నుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బాడీ బిల్డింగ్‌ అసోసియేషన్‌ అభివృద్ధికి నిరంతరం కషి చేస్తానని అన్నారు.

➡️