పార్లమెంటును రక్షించలేని పాలకులు ప్రజలను ఎలా రక్షిస్తారు..?

Dec 22,2023 12:41 #Tirupati district
protest against mps suspention tpt

141 మంది ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామిక చర్య

హోం మినిస్టర్ తక్షణమే రాజీనామా చేయాలి

సిపిఐ సిపిఎం కాంగ్రెస్ నేతలు డిమాండ్

ప్రజాశక్తి-కాళహస్తి : శుక్రవారం ఉదయం 11 గంటలకు కాళహస్తి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద 141 మంది ఎంపీలు సస్పెండ్ చేయడానికి వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం -పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బత్తయ్య నాయుడు సీపీఐ జిల్లా కార్యదర్శి పి మురళి సిపిఎం పార్టీ నియోజకవర్గ కార్యదర్శి పుల్లయ్య లు మాట్లాడుతూ పార్లమెంటును రక్షించలేని పాలకులు ప్రజలనెలా రక్షిస్తారని ఆరోపించారు సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పీ మురళి ధ్వజమెత్తారు.బ్రిటీష్ పాలకులకు మించిన నిరంకుశ పాలన దేశంలో కొనసాగుతోందన్నారు. ఈ నెల 13న పార్లమెంటులో పొగబాంబులతో బెంబేలెత్తించిన సంఘటనతో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకే రక్షణ లేదని తేలిపోయిందన్నారు. పార్లమెంటునే రక్షించని పాలకులు 142 కోట్ల ప్రజలను ఎలా రక్షిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటుకు రక్షణ కల్పించాలని నిలదీసిన 141 ఎంపీలను స్పెండ్ చేయడం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నిరంకుశ పాలనను అద్దం పడుతోందన్నారు. భారతదేశ చరిత్రలో భారీ స్థాయిలో ఎంపీలను సస్పెండ్ చేసిన దాఖలాలు లేవన్నారు. ఈ విషయమై సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, లోక్ సత్తా పార్టీలతో ఇతర పార్టీలు కలుపుకొని ఈరోజు దేశ వ్యాప్త నిరసనలను చేయడం జరిగిందని అందులో భాగంగా కాళహస్తి పట్టణంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ కాలాస్త్రి నియోజకవర్గం కార్యదర్శి జన మాలగురవయ్య వైయస్ మనీ నగర కార్యదర్శి R గోపి మించిల శివకుమార్ మోహన్ రెడ్డి కార్తీకు గురవయ్య ధన, సిపిఎం నాయకులు గురవయ్య వేణు గంధం మనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు గిరి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

➡️