‘హుందా రాజకీయాలు నేర్చుకో సుధీరన్నా’

'హుందా రాజకీయాలు నేర్చుకో సుధీరన్నా'

‘హుందా రాజకీయాలు నేర్చుకో సుధీరన్నా’ ప్రజాశక్తి-శ్రీకాళహస్తి: బొజ్జల గోపాలకష్ణారెడ్డి, బొజ్జల హరినాధ రెడ్డిలా హుందా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని యువత విభాగం నాయకులు సామాను శ్రీధర్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో ఎస్‌ఎస్‌ఆర్‌ యూత్‌ ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన ముఖ్య అనుచరుడు హరీష్‌ రెడ్డి మాట్లాడుతూ సామాను శ్రీధర్‌ రెడ్డి పై బొజ్జల సుధీర్‌ రెడ్డి కుటుంబ విషయాలు, వ్యక్తిగత అంశాలపై అనుచితంగా మాట్లాడడం సంస్కారం కాదని అన్నారు. వారి నాన్న బొజ్జల గోపాల కష్ణారెడ్డి, వారి చిన్నాన్న బొజ్జల హరినాథ్‌ రెడ్డి గత 35 ఏళ్లుగా శ్రీకాళహస్తిలో హుందాతనంగా రాజకీయాలు చేసినట్లు గుర్తు చేశారు. మరి వారి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన మీరు సామాను శ్రీధర్‌ రెడ్డి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొని, రాజకీయాలకు వాడుకోవడం సహేతుకం కాదని సూచించారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డికి, సామాను శ్రీధర్‌ రెడ్డికి అన్ని అంశాల్లోనూ తెగదెంపులు జరిగిపోయాయనీ, అయినా బావాబామ్మర్ది ఒకటే అంటూ సుధీరన్న వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. మరోసారి సామాను శ్రీధర్‌ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమనీ, తగిన పర్యావసనాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. శివకుమార్‌, కోటేశ్వరరావు, నరేంద్ర, వాసు, గణేష్‌, సోహాన్‌ పాల్గొన్నారు.

➡️