టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్‌ రెడ్డి నామినేషన్‌ పసుపుమయమైన పలమనేరు

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్‌ రెడ్డి నామినేషన్‌ పసుపుమయమైన పలమనేరు

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథ్‌ రెడ్డి నామినేషన్‌ పసుపుమయమైన పలమనేరు.ప్రజాశక్తి, పలమనేరుచిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అమర్నాథ్‌ రెడ్డి నామినేషన్‌ కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదట పలమనేరులో ఎద్దుల చెరువు కట్ట వద్ద ఓం శక్తి దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రారంభమైన ర్యాలీ, అయ్యాకణ్ణ వీధి నుండి బజారు వీధి, జెవిలి వీధివైపు తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు వివిశేష జనవాహినితో ఊరేగింపుగా చేరుకొని జెవిలి వీధిలో ప్రసంగించారు. ఆ తర్వాత గుడి యాత్తం రోడ్డు సర్కిల్‌ అంబేద్కర్‌ సర్కిల్‌ మీదుగా ఆర్డిఓ ఆఫీసు చేరుకొని అట్టహాసంగా అమర్నాథ్‌ రెడ్డి తన నామినేషన్‌ పత్రం దాఖలు చేశారు. జెవిలి వీధిలో అమర్నాథరెడ్డి మాట్లాడుతూ వైసిపి ఎమ్మెల్యే అక్రమాలను వైసీపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని . జగన్‌ మోసపూరిత కుట్రలను అరాచకాలను అక్రమాలను వైన్‌ మాఫియా మైన్‌ మాఫియా భూకబ్జాలు కరెంటు ఛార్జీలు పెంచడం రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచడం బస్సు ఛార్జీలు పెంచడం పెట్రోల్‌ చార్జీలు పెంపకం గురించి ప్రజలకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా వివరించారు. ఈ ప్రసంగానికి ప్రజల నుంచి చప్పట్లతో హర్షద్వానాలతో విశేషంగా స్పందించారు.

➡️