కౌంటింగ్‌ ఏర్పాట్లు కట్టుదిట్టం

May 23,2024 21:52
కౌంటింగ్‌ ఏర్పాట్లు కట్టుదిట్టం

135 సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపుహింసాత్మక ఘటనలకు పాల్పడొద్దుప్రజాశక్తి – తిరుపతి సిటి, రామచంద్రాపురం కౌంటింగ్‌ సన్నద్ధత ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా వర్చువల్‌ విధానంలో సమీక్షించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌ సజావుగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కౌంటింగ్‌ సూపర్వైజర్లు, కౌంటింగ్‌ సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు కు విధుల కేటాయింపు కొరకు ఫస్ట్‌ ర్యాండమైజేషన్‌ ఈనెల మే26న, రెండవ రాండమైజేషన్‌ జూన్‌ 3 తారీఖున అబ్జర్వర్‌ సమక్షంలో చేపడతామన్నారు. 22న బుధవారం కౌంటింగ్‌ విధులకు హాజరయ్యే సిబ్బందికి మొదటి దశ శిక్షణ ఇచ్చామన్నారు. 90 సీసీ కెమెరాలు ఏర్పాటుతో, స్ట్రాంగ్‌ రూము దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కవర్‌ అయ్యేలా ఏర్పాటు చేశామని తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు నాలుగో తేదీన సాయంత్రం నాలుగు కల్లా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేపడుతున్నామని, ఈవీఎం కంట్రోల్‌ యూనిట్ల ఓట్ల లెక్కింపు కూడా ఆలోపు పూర్తి చేస్తామని తదనుగునంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తిరుపతి పార్లమెంటు నియోజక వర్గ పోస్టల్‌ బ్యాలెట్‌ 15 టేబుల్‌ ఏర్పాటుతో 3 రౌండ్లలో పూర్తి చేసేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సెల్‌ఫోన్‌, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌కు అనుమతి లేదుకంట్రోల్‌ రూం నందు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, స్ట్రాంగ్‌ రూంలను ప్రతి రోజూ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించవచ్చని, స్ట్రాంగ్‌ రూంలను ప్రతి రోజూ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించే ఏర్పాటు చేశామని, కౌంటింగ్‌ కేంద్రంలోనికి సెల్‌ ఫోన్‌, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌ లు అనుమతి లేదని, హింసాత్మక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. గురువారం రాజకీయ పార్టీల నాయకులు, పోటీలోని అభ్యర్థుల సమావేశం స్థానిక కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నందు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ నిర్వహణకు అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు సహకరించాలని, కౌంటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఎలాంటి ర్యాలీలు విజయోత్సవ సభలు సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ పెంచల కిషోర్‌ పాల్గొన్నారు.సమస్యలు తలెత్తకుండా చూడాలి : ఆరణి శ్రీనివాసులు జూన్‌4న జరిగే కౌంటింగ్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎన్‌డిఎ కూటమి ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు అన్నారు. గురువారం స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేస్తున్న వారిపై సైబర్‌ క్రైం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్‌ ఏజెంట్‌ మహేష్‌ యాదవ్‌ పాల్గొన్నారు.హింసాత్మక ఘటనలకు పాల్పడితే చర్యలు : ఎస్‌పిసార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌ రాజు తెలిపారు. హింసాత్మక ఘటనలతో జిల్లా పోలీసులు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగా హై అలర్ట్‌ అయ్యారు. గురువారం చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలం, చుట్టుగుంట రామాపురం గ్రామాన్ని ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు, ట్రైనింగ్‌ ఎస్పి దేవరాజ్‌, అడిషనల్‌ ఎస్పీ కులశేఖర్‌, డీఎస్పీలు రవీందర్‌ రెడ్డి, శరత్‌ రాజ్‌ కుమార్‌ లు సందర్శించి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి, దిగువ రామాపురం, ఎగువ రామాపురం గ్రామాలలో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ శేఖర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మదన్మోహన్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సురేష్‌, యోబు, సిబ్బంది త్యాగరాజు, ధనుంజయులు, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.135 సమస్యాత్మక ప్రాంతాలుకౌంటింగ్‌ రోజు అందరూ క్రమశిక్షణతో మెలిగి పోలీస్‌ వారికి సహకరించి ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని ఎస్‌పి సూచించారు. తిరుపతి జిల్లాలో 135 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి పోలీస్‌ పికెట్లను ఏర్పాటు చేసి, నిరంతరం నిఘా ఉంచామన్నారు. అలాగే 3 మాబ్‌ కంట్రోల్‌ టీం లను ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు బందోబస్తుకు దాదాపు 1500 మంది పోలీసులు, 2 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలు, కొన్ని ఏపీఎస్పీ ఫ్లటున్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.

➡️