తోటపల్లి నీరిచ్చిన ఘనత మాదే

Apr 12,2024 21:25

 ప్రజాశక్తి-గుర్ల  : తోటపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించిన ఘనత తమదేనని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కిమిడి కళావెంకటరావు అన్నారు. గురువారం గుర్లలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం తోటపల్లి కాలువల నిర్వహణకు రూ.3 కోట్లు ఖర్చు చేయకపోవడంతో రైతులు సుమారు 500 కోట్లు రూపాయలు నష్టపోయారని తెలిపారు. పాదయాత్రలో ముద్దులు పెట్టి, పరిపాలనలో ప్రజలపై గుద్దులు గుద్దుతున్న జగన్‌ ప్రభుత్వం దుర్మార్గాలకు అంతులేదన్నారు.కార్యక్రమంలో మాజీ విప్‌ గద్దె బాబూరావు, టిడిపి నాలుగు మండలాల అధ్యక్షులు చనమల్ల మహేశ్వరరావు, ఎస్‌.సురేష్‌, రౌతు కాము నాయుడు, తాడ్డి సన్యాసినాయుడు, నాయకులు వెన్నె సన్యాసినాయుడు, బిజెపి నాయకులు రెడ్డి పావని, ఉప్పలపాటి రాజేష్‌ వర్మ, జనసేన నాయకులు విజినిగిరి శ్రీనివాసరావు, మండల నాయకులు తిరుములరాజు కిరణ్‌ కుమార్‌, కీలరి సూర్యనారాయణ, పిల్లా అప్పల నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 50 మంది కార్యకర్తలు టిడిపిలో చేరారు.

➡️