వివాహ వేడుకల్లో విషాదం

ప్రజాశక్తి-నాగులప్పలపాడు : మండల పరిధిలోని చదలవాడ ఎస్‌సి కాలనీకి చెందిన అంబడి నాగేశ్వరరావు కుమారుడు మధు వివాహ వేడుకలు బుధవారం నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా వివాహ వేడుకలకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేశారు. పెళ్లి మరో రెండు గంటల్లో జరగనున్న నేపథ్యంలో వంట పనులు పర్యవేక్షిస్తున్న పెండ్లి కుమారుడు మధు తండ్రి నాగేశ్వరరావు గుండెపోటుతో చనిపోయాడు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న టిడిపి సంతనూతలపాడు నియోజక వర్గ అభ్యర్థి బిఎన్‌. విజయకుమార్‌ నాగేశ్వరావు మతదేహన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాగేశ్వరావు మతదేహన్ని ఒంగోలు తరలించి వివాహం జరిపించారు. అదేవిధంగా కనపర్తి గ్రామానికి టిడిపి నాయకుడు కుక్కల వెంకటనారాయణ రెడ్డి అనారోగ్యంతో మతి చెందాడు. ఆయన మతదేహన్ని విజయకుమార్‌ సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మాజీ ఎంపిపి వీరయ్య చౌదరి,టిడిపి మండల అధ్యక్షుడు తేళ్ళ మనోజ్‌ ,కాకర్ల లక్ష్మి వరప్రసాదు, అడకా స్వాములు చాట్ల నారాయణ, అయ్యపురెడ్డి, ఏసురత్నం, ఏడుకొండలురెడ్డి, బ్రహ్మయ్య,నాగార్జున రెడ్డి,గుమ్మావేణు, దేవరపల్లి సరేష్‌, గ్రామస్తులు ,తదితరులు పాల్గొన్నారు.

➡️