జ్యోతిబా పూలేకు ఘన నివాళి

ప్రజాశక్తి -కనిగిరి : మహాత్మ జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి వైసిపి కనిగిరి నియోజక వర్గ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్‌ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌, జడ్‌పిటిసి కస్తూరి రెడ్డి ,పిడిసిసి బ్యాంక్‌ చైర్మన్‌ ప్రసాద్‌ రెడ్డి , పిసిపల్లి జడ్‌పిటిసి ఓకే రెడ్డి, ఎఎంసి చైర్మన్‌ చింతగుంట్ల సాల్మన్‌ రాజ్‌, కనిగిరి నియోజకవర్గ ఎస్‌సి నాయకుడు కటికల వెంకటరత్నం, ఎంపిటిసి నాగేశ్వరరావు, కనిగిరి పట్టణ ఎస్‌సి సెల్‌ నాయకుడు కిషోర్‌, బిటిఎ మాజీ అధ్యక్షుడు ప్రతాప్‌, ఎస్‌సి నాయకుడు బ్రహ్మయ్య, బీసీసెల్‌ నాయకులు ద్రోణాదుల చెంచులు, పిల్లి లక్ష్మీనారాయణ రెడ్డి, కమతం రమణారెడ్డి, సిఎస్‌పురం యూత్‌ అధ్యక్షుడు బొర్రాజు రమణయ్య, రమేష్‌ , పలుకూరి భాస్కర్‌ పాల్గొన్నారు.డాక్టర్‌ ఉగ్ర నివాళి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే అని టిడిపి కనిగిరి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి తెలిపారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆర్‌ అండ్‌ బి బంగ్లా వద్ద ఉన్న ఫూలే విగ్రహానికి బీసీ సంఘాలతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్షుడు నంబుల వెంకటేశ్వర్లు, నాయకులు ముచ్చుమారి చెంచిరెడ్డి, రాజమళ్ళ శ్రీనివాసరెడ్డి, పిచ్చల శ్రీనివాసరెడ్డి, షేక్‌ ఫిరోజ్‌, ఐవి. నారాయణ, పి. మాలకొండయ్య, చింతలపూడి తిరుపాలు, విజయరామరాజు, చింతలపూడి వాసుదేవరావు, తమ్మినేని సురేంద్ర రెడ్డి, కొండలు, బ్రహ్మారెడ్డి, మనోహర రావు. ఈదర రవికుమార్‌, నారాయణ, పాలూరి సత్యం పాల్గొన్నారు.కొత్తపట్నం : మండల పరిధిలోని ఈతముక్కల గ్రామంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సామాజిక సహోదయమ వేదిక రాష్ట్ర కార్యదర్శి గడ్డం అమతవాణి ,రజక సంఘ సభ్యులు బ్రహ్మయ్య ,సోషల్‌ మీడియా కన్వీనర్‌ స్వర్ణ సుబ్బారావు, రాజుపాలెం ఎంపిటిసి ఉప్పుటూరి కోటేశ్వరరావు, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు గడ్డం రామానుజులు, నల్లగట్ల మోహన్‌ రావు, మద్దిరాల యేసోబు ,బీసీ నాయకులు జాజుల శ్రీనివాసరావు ,పూరి మెట్ల కోటేశ్వరరావు , పిల్లి అంజయ్య, దోనేపూడి ప్రేమ కుమార్‌, లింగంగుంట కోట్లు, స్వర్ణ ఆంజనేయులు పాల్గొన్నారు.

➡️