కందుల శ్రీనివాసరావుకు ఘన నివాళి

మాట్లాడుతున్న సిపిఎం మండల కార్యదర్శి ఐవి

ప్రజాశక్తి-ఎటపాక

సిపిఎం నాయకులు కీర్తిశేషులు కందుల శ్రీనివాసరావు మూడో వర్థంతి సందర్భంగా సోమవారం సిపిఎం నాయకులు మండలంలోని నందిగామలో ఆయన స్థూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఎం నాయకులు పులుసు బాలకృష్ణ అధ్యక్షత జరిగిన సభలో పార్టీ మండల కార్యదర్శి ఐ.వి. మాట్లాడుతూ కందుల శ్రీనివాసరావు తన జీవితాంతం ప్రజల కొరకు త్యాగం చేశారన్నారు. తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యలపై పోరాడేవాడని గుర్తు చేశారు. పార్టీ ఇచ్చే పిలుపులను అందుకొని ప్రతి కార్యకర్త పని చెయ్యాలని, అదే కందుల శ్రీనివాసరావుకు మనమిచ్చే నిజమైన నివాళి అని ఐ.వి. పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు పులుసు సూర్యనారాయణ, నాయకులు సోయం వీరమ్మ, సోందె రామారావు, జి.హరి, కందుల సతీష్‌, రవి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

➡️