కారల్‌ మార్క్స్‌కు ఘన నివాళి

May 5,2024 20:34

ప్రజాశక్తి – గజపతినగరం: సిపిఎం ఆధ్వర్యంలో గజపతినగరంలో కారల్‌ మార్క్స్‌ 206 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సిపిఎం జిల్లా నాయ కులు జి శ్రీనివాస్‌, ఆర్‌ రాములు మాట్లాడుతూ కారల్‌ మార్క్స్‌ భౌతికంగా లేనప్పటికీ ఆయన ఆశయాలు సిద్ధాంతా లు ముందుకు తీసుకుపోయేవారిలో సజీవంగానే ఉన్నార న్నారు. పెట్టుబడిదారులు సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా కార్మికుల కష్టజీవులను ఐక్యం చేసే శాస్త్రీయమైన సిద్ధాంతాన్ని రూపకల్పన చేసిన మహానుభావుడు మార్క్స్‌ అని గుర్తు చేశారు. రష్యాలో కమ్యూనిస్టులు అధికారం కోల్పోయిన తర్వాత కమ్యూనిస్టు పార్టీలకి కమ్యూనిస్టులకి కాలం చెల్లిపో యిందన్న వారికి చైనా విప్లవం సరైన సమాధానం చెప్పింద న్నారు. నేడు ప్రపంచంలో చైనా, క్యూబా, వియత్నాం వంటి దేశాలు సోషలిస్ట్‌ మార్గంలో ముందుకు పోతున్నాయన్నారు. భారతదేశంలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకరిస్తూ నిత్యవసర సరుకులు ధరలు నిరంతరం పెంచుతుందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందన్నారు. రాజ్యాంగాన్ని లౌకికవాదాన్ని ప్రజాస్వా మ్యాన్ని కాలరాస్తూ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందన్నారు. మరోవైపు మతం పేరుతో రిజర్వేషన్ల పేరుతో కులాల మధ్యన మతాల మధ్యన ఘర్షణలను సృష్టి స్తుందన్నారు. పెట్టుబడి దారులకు ఊడిగంచేస్తూ మత రాజకీ యాలు చేస్తున్న పాసిస్ట్‌ పార్టీ బిజెపి నుండి లౌకిక వాదాన్ని, భారతదేశాన్ని రక్షించేది కేవలం కమ్యూనిస్టులే అన్నారు. ఈ బిజెపి విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ కమ్యూనిస్టులతో కలిసి రావాలని, నేడు జరుగుతున్న ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నింటినీ కలుపుకొని ఇండియా వేదిక బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్‌ రాములు, హరికృష్ణ, వేణి రాము విద్యార్థులు పాల్గొన్నారు.

➡️