తెలుగు పండగల్లో ఉగాదిది అగ్రస్థానం

Apr 9,2024 21:09

ప్రజాశక్తి-విజయనగరం  : స్థానిక సీతం ఇంజినీరింగ్‌ కళాశాల బాలికల హాస్టల్‌లో ఉగాది వేడుకను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బొత్స ఝాన్సీలక్ష్మి, కళాశాల డైరెక్టర్‌ మజ్జి శశి భూషణ్‌ రావు, ప్రిన్సిపాల్‌ డివి రామమూర్తి, చీఫ్‌ వార్డెన్‌ కెప్టెన్‌ మీసాల సత్యవేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ తెలుగు వారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాదికి అగ్రస్థానం ఉంటుందన్నారు. కళాశాల డైరెక్టర్‌ శశి భూషణ్‌రావు మాట్లాడుతూ షడ్రచుల సమ్మేళనంగా చేసే ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డివి రామమూర్తి, విద్యార్థులు పాల్గొన్నారు. నాగవంశ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు శ్రీ క్రోధి నామ సంవత్సర తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు నాగవంశ సంక్షేమ సంఘం ఆధ్వర్యాన మంగళవారం జరిగాయి. ఆ సంఘం భవనంలో మంగళవారం సంఘ అధ్యక్షులు, వైసిపి నాయకులు అవనాపు విక్రమ్‌ దంపతులు పాల్గొన్నారు. ప్రముఖ పంచాంగ కర్త తనికెళ్ల ప్రభాకర శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సర కాలంలో వచ్చే పుష్కరాలు, శుభ ముహూర్తాలు వివరాలు వివరించారు. ఆయా రాశుల వారికి సంవత్సర ఫలితాలు వివరించారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్‌ గారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ విధంగా తెలుగు సంవత్సరాది ఉగాది రోజున పంచాంగశ్రవణం నిర్వహించాలని భావిస్తున్నామన్నారు. మన సంస్కతి, సాంప్రదాయాలు భవిష్యత్తు తరాలకు అందజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో డిసిఎంఎస్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ అవనాపు భావన, అర్బన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మెన్‌ కాళ్ల గౌరీశంకర్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ కనకల మురళీమోహన్‌, మాజీ కౌన్సిలర్‌ గాడు అప్పారావు, నాగవంశ సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు.

➡️