బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో వెనిగండ్ల రాము

Mar 21,2024 17:27 #Krishna district

ప్రజాశక్తి గుడ్లవల్లేరు : మండలంలోని శేరిదగ్గుమిల్లి, చింతలగుంట, కట్టావానిచెరువు గ్రామాల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి వెనిగండ్ల రాము ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా కోరారు. గ్రామాల ప్రజలు సమస్యలను రాము కు విన్నవించారు. ఆ సమస్యలపై వెనిగండ్ల రాము సానుకూలంగా స్పందించి పరిష్కారానికి హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వర్ రావు , పిన్నమనేని వెంకటేశ్వరరావు,గుడ్లవల్లేరు మండల టిడిపి అధ్యక్షులు కొసరాజు బాపయ్య చౌదరి , క్లస్టర్ ఇంచార్జ్ అడుసుమిల్లి రామ్మోహన్ రావు ,కొడాలి రామరాజు,అట్లూరి శ్రీరామచంద్ర ప్రసాద్,అట్లూరి స్వరూప్, జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ , పేర్ని జగన్ జన్ను శివకుమార్,వేమన ఆదిశేషు,భూపతి రామకృష్ణ,అద్దంకి రాంబాబు, కొప్పుల వెంకటేశ్వరరావు, చాట్ల భాస్కరరావు, ఇంటూరు మోషే , చింతలగుంట గ్రామంలో చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈడే మోహన్, బెజవాడ వెంకయ్య, శ్రీనివాసరావు, తార దావీదు, సుబ్బయ్య, మరియు కట్టావానిచెరువు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ షాక్గ్యారెంటీ కార్యక్రమం లో కరీం, మహబూబ్, కాగిత నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

➡️