అనధికారంగా కరెంటు వాడకం – కేసు నమోదు చేసిన విజిలెన్స్‌ అధికారులు

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : అనధికారంగా కరెంటు వాడుతున్నవారిపై అధికారులు కేసు నమోదు చేశారు. కే.గంగవరం మండలంలోని పాతకోట గ్రామంలో విద్యుత్‌ దొంగతనం జరుగుతుందని సమాచారంతో విజిలెన్స్‌ అధికారులు బుధవారం దాడులు జరిపారు. రెండు మోటార్లకు అనధికారకంగా విద్యుత్‌ స్తంభాల నుండి కరెంటును వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి కారకుల పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ అధికారులు డి ఈ ఈ , ఎల్‌.సతీష్‌ నాయక్‌, ఏ ఈ డిపి, ఏ. మురళి, కానిస్టేబుల్‌ టి.జీ నారాయణ పాల్గొన్నారు. విద్యుత్‌ దొంగతనం చేసినవారికి కోర్టు ఆదేశాలతో జరిమానా విధిస్తారని అధికారులు తెలిపారు.

➡️