ఆర్‌టిసిపై కాసుల వర్షం

Jan 28,2024 21:40

ప్రజాశక్తి-విజయనగరంకోట : సంక్రాంతి పండగకు ఆర్‌టిసిపై కాసుల వర్షం కురిసింది. జిల్లా పరిధిలో సంక్రాంతి సందర్భంగా నడిపిన ప్రత్యేక సర్వీసులకు గాను రూ.60,62,477 ఆదాయం వచ్చినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సిహెచ్‌.అప్పలనారాయణ తెలిపారు. విజయనగరం, శృంగవరపుకోట డిపోల నుంచి సంక్రాంతి సందర్భంగా వివిధ జిల్లా కేంద్రాలకు, హైదరాబాద్‌, విజయవాడ, భీమవరం వంటి ప్రధాన నగరాలకు 283 ప్రత్యేక బస్సులను సాధారణ ఛార్జీలతో నడిపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రెండు డిపోల మేనేజర్లకు, సిబ్బందికి, ప్రయాణికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శంబర పోలమాంబ జాతరకు జిల్లా నుండి 30 ప్రత్యేక బస్సులు నడిపామని, రూ.4 లక్షలు ఆదాయం వచ్చిందని తెలిపారు.

➡️