ఎస్‌పి దీపికకు అవార్డు

Dec 16,2023 22:04

విజయనగరం:  రాష్ట్ర వ్యాప్తంగా శాంతిభద్రతల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్‌ నుండి అడిషనల్‌ డిజి స్థాయి అధికారులకు డిజిపి కె.రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం అవార్డులను ప్రదానం చేశారు. మంగళగిరిలో డిజిపి ప్రధాన పోలీస్‌ కార్యాలయంలో ఆయన అవార్డులను అందజేశారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా ఎస్‌పి ఎం.దీపిక పాటిల్‌కు క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల విభాగంతో పాటు దిశ, కన్విక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అందించిన సేవలను గుర్తించిన డిజిపి రాజేంద్రనాథ్‌ రెడ్డి డిజిపి డిస్క్‌ అవార్డును ప్రదానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. చీపురుపల్లి పోలీసు స్టేషనులో కానిస్టేబులుగా పని చేస్తున్న భానోజీరావు కూడా డిజిపి డిస్క్‌ అవార్డు అందుకున్నారు.

➡️