ఏడో వార్డులో బేబినాయన ప్రచారం

Mar 21,2024 19:31

ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపాలిటీలోని ఏడో వార్డులో గురువారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. రెండు దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. అభివృద్ధిలో వైసిపి విఫలమైందన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం సాధిస్తే అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు రాంబర్కి శరత్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️