కొత్త విషయాలు నేర్చుకోవాలి

ప్రజాశక్తి-నెల్లిమర్ల : విద్యార్థులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ పరిజ్ఞానాన్ని పెంపొందించు కోవాలని సెంచూరియన్‌ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ ప్రశాంత్‌కుమార్‌ మహంతి పిలుపునిచ్చారు. ఇటీవల సెంచూరియన్‌ విశ్వవిద్యాలయంలో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్ల శిక్షణ పొందిన నిజామాబాద్‌కు చెందిన టెమ్రిస్‌ మూడో బ్యాచ్‌ విద్యార్థులకు శుక్రవారం విసి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృత్తి సంబంధమైన కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భం గా ఇటీవల విద్యార్థులు శిక్షణలో నేర్చుకున్న విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీన్‌ ప్రొఫెసర్‌ ఎం.ఎల్‌.ఎన్‌. ఆచార్యులు, ఐక్యూఎసి డీన్‌ ప్రొఫెసర్‌ పిఎస్వి రమణారావు, డీన్‌ డాక్టర్‌ సన్నీ డయోల్‌, డీన్‌ ప్రొఫెసర్‌ మురళీ, అనస్తీషియా విభాగాధిపతి కె.వెంకట కళ్యాణ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ చైతన్య, డాక్టర్‌ పుష్పలత, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ నాగ జోగయ్య, టెమ్రీస్‌ కో-ఆర్డినేటర్‌ ఎన్‌.సాయి కుమార్‌ పాల్గొన్నారు.

➡️