జెసి మయూర్‌ అశోక్‌ బదిలీ

Jan 28,2024 21:36

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న కె.కార్తిక్‌ రానున్నారు. మయూర్‌ అశోక్‌ విశాఖపట్నం జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీపై వెళ్లనున్నారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడేళ్లు దాటి ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన విషయం విదితమే. ఇందులో భాగంగా వీరిద్దరికీ స్థానచలనం కలిగింది. అశోక్‌ సౌమ్యుడిగా, వివాద రహితుడిగా ముద్ర వేసుకున్నారు.

➡️