టిడిపి, జనసేన కలయికతో ప్రజలకు మేలు

Jan 2,2024 21:49

ప్రజాశక్తి-విజయనగరం కోట : టిడిపి, జనసేన కలయికతో ప్రజలకు ప్రయోజనం జరుగుతుందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు తెలిపారు. బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరంలోని 40వ డివిజన్‌ పరిధిలో పోలయ్యపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె టిడిపి మినీ మేనిఫెస్టో హామీలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని కాపాడాలంటే టిడిపి – జనసేన ప్రభుత్వం ఏర్పడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలి నాయుడు, వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు పాల్గొన్నారు.

➡️