టిబి రహిత సమాజమే ధ్యేయం

Mar 21,2024 19:30

ప్రజాశక్తి-వేపాడ : టిబి రహిత సమాజమే ధ్యేయమని వేపాడ పిహెచ్‌సి వైద్యాధికారి ఎ.ధరణి తెలిపారు. గురువారం స్థానిక ఆదర్శ పాఠశాలలో క్షయవ్యాధి నిర్మూలన సంబంధిత అంశాలతో వాల్‌పోస్టర్‌ను ధరణి ఆవిష్కరించారు. క్షయ వ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సిహెచ్‌ఒ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.కొత్తవలస : వియ్యంపేటలోని బి.ఆర్‌.అంబేద్కర్‌ గురుకులంలో ప్రిన్సిపల్‌ టి. జయశ్రీ ఆధ్వర్యంలో సీతంపేటలో క్షయవ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ ఎం.ఈశ్వరరావు, హెల్త్‌ అసిస్టెంట్‌ సత్యారావు, హెచ్‌ఎస్‌ ఈశ్వరరావు, స్టాఫ్‌ నర్స్‌ దీప, ఎంఎల్‌హెచ్‌పి కామేశ్వరి, ఎఎన్‌ఎం భవాని, జ్యోతి పాల్గొన్నారు.

➡️