నాయుడు కాలనీలో కల్వర్టులు నిర్మించండి

Mar 21,2024 19:28

ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపాలిటీలోని నాయుడు కాలనీలో కల్వర్టులు నిర్మించాలని కమిషనర్‌ ఎల్‌.రామలక్ష్మిని న్యాయవాది పోల అరుణ్‌ కుమార్‌, కాలనీ ప్రజలు కోరారు. నాయుడు కాలనీలో గురువారం పారిశుధ్య పనులను కమిషనర్‌ పరిశీలించారు. కాలనీలో కల్వర్టులు లేకపోవడంతో మురుగునీరు, వర్షాలు కురిస్తే వరదనీరు వెళ్లడం లేదని స్థానికులు కమిషనర్‌కు వివరించారు. దీంతో ఇళ్ల ముందే నీరు నిల్వ ఉండటంతో దోమలు వృద్ధి చెంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కల్వర్టులు నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తామని కమిషనర్‌ హామీ ఇచ్చారు.

➡️