పోరాట విజయం

Jan 23,2024 17:59

ప్రజాశక్తి-బొబ్బిలి : పట్టణంలో అంగన్వాడీలు విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు మాట్లాడుతూ నిజాయతీగా పోరాడే వారిదే అంతిమ విజయమన్నారు. సమ్మెకు మద్దతిచ్చిన ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. గజపతినగరం : గజపతినగరంలో బ్రిడ్జి వద్ద అంగన్వాడీలు విజయోత్సవ సభ నిర్వహించి, కేకు కట్‌ చేశారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వి.లక్ష్మి మాట్లాడుతూ 42 రోజులపాటు ఎన్ని నిర్బంధాలకు, బెదిరింపులకు పాల్పడినా తలొగ్గకుండా అంగన్వాడీలు పోరాడి, విజయం సాధించారని తెలిపారు. ఐక్యంగా పోరాటం సాగించిన అంగన్వాడీలకు, సంఘీభావం తెలిపిన రాజకీయ, ప్రజా సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్‌, కౌలురైతుసంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి ఆర్‌.హరికృష్ణవేణి, అంగన్వాడీ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షులు సుభాషిణి, సెక్టార్‌ నాయకులు నాగమణి, సన్యాసమ్మ, నరసమ్మ, దమయంతి, వాణి, రమణమ్మ, రాములమ్మ, పద్మ, సుజాత నారాయణమ్మ పాల్గొన్నారు.

➡️