బాక్సింగ్‌ పోటీలు ప్రారంభం

బాక్సింగ్‌ పోటీలను ప్రారంభిస్తున్న మేయర్‌, డిప్యూటీ మేయర్‌

ప్రజాశకి-విజయనగరం టౌన్‌ : స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం అండర్‌ 14,17,19 విభాగాల్లో బాక్సింగ్‌ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. స్థానిక రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో ఉన్న బాక్సింగ్‌ కోర్టులో పోటీలను డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రావణి ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడా పోటీలు శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడతాయని అన్నారు. మూడు విభాగాల్లో రాష్ట్ర పోటీలు జిల్లా కేంద్రంలో జరగడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉప విద్యా శాఖ అధికారి వాసుదేవరావు, ఎస్‌జి ఎఫ్‌ కార్యదర్శి ఎల్‌వి రమణ, బాక్సింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.మన్మధరావు, వైసిపి నగర అధ్యక్షులు ఎ.వేణు,కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి కాళ్ళ సూరిబాబు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి పి.శ్రీనివాసరావు, బాక్సింగ్‌ కోచ్‌ బి.ఈశ్వరరావు రాష్ట్ర వ్యాప్తంగా 900 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️