బెటాలియన్‌ కమాండెంట్‌గా ఎ.ఎస్‌.రాణా

Feb 5,2024 20:57

ప్రజాశక్తి- డెంకాడ : ఎపిఎస్‌పి ఐదో బెటాలియన్‌ కమాండెంట్‌గా అధిరాజ్‌సింగ్‌ రాణా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన్ను పోలీసు అసోసియేషన్‌ సిబ్బంది, అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం రాష్ట్ర పోలీస్‌ అసోసియేషన్‌ డైరీ 2024ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మిత్తిరెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోరాడ రామునాయుడు, సెక్రటరీ మజ్జి శ్రీను, ఆర్‌ఐ ట్రెజరర్‌ పివిఆర్‌ మూర్తి, మెంబర్స్‌ రాంకుమార్‌, రాంబాబు, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.

➡️