బ్రాహ్మణులకు తీవ్ర అన్యాయం : టిడిపి

Feb 23,2024 21:04

ప్రజాశక్తి-విజయనగరంకోట : బ్రాహ్మణులకు వైసిపి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అదితి గజపతిరాజు అన్నారు. టిడిపి ఆధ్వర్యంలో ‘బాబు చెంతకి – బ్రహ్మా(ణ)స్త్రం’, బాధిత బ్రాహ్మణుల విముక్తికి జనసేనతో సన్నద్ధం అనే కార్యక్రమం పోస్టర్‌ను శుక్రవారం స్థానిక అశోక్‌ బంగ్లాలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపి హయాంలో బ్రాహ్మణులకు ప్రత్యేకమైన కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుది అన్నారు. బ్రాహ్మణ సాధికార కమిటీ పార్లమెంట్‌ కన్వీనర్‌ ఇనుగంటి రాకేష్‌ శర్మ, బ్రాహ్మణ సంఘ నాయకులు పేరి రామయ్య మాట్లాడుతూ 2017లో అశోక్‌ గజపతిరాజు 1200 గజాలు కేటాయించి, బ్రాహ్మణ పరుశురాం భవనాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే, నేడు స్థానిక కార్పొరేటర్లు కబ్జా చేయడానికి చూస్తున్నారని తెలిపారు. దీనిపై ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్‌, మండల అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు, బిసి సెల్‌ నాయకులు వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌బాబు, అవనాపు విజరు, పిల్లా విజరుకుమార్‌ పాల్గొన్నారు.

➡️