భీమిలి సభను విజయవంతం చేయాలి

Jan 23,2024 18:01

ప్రజాశక్తి-తెర్లాం : ఈ నెల 27న భీమిలిలో జరిగే వైసిపి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు కోరారు. స్థానిక రామకృష్ణ థియేటర్‌ ఆవరణలో మంగళవారం వైసిపి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర నుంచే ఎన్నికల శంఖారావాన్ని సిఎం జగన్‌ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపిపి నర్సుపల్లి ఉమాలక్ష్మి, జెడ్‌పిటిసి గర్బాపు రామారావు, ఎఎంసి చైర్మన్‌ బొమ్మి శ్రీనివాసరావు, వైస్‌ ఎంపిపి చీపేన సత్యనారాయణ, అప్పలరాజు, వైసిపి మండల అధ్యక్షులు తెంటు సత్యంనాయుడు, మండల యువజన విభాగం అధ్యక్షులు మదాసు శేషగిరి, తదితరులు పాల్గొన్నారు.

➡️