మంచి జరిగితేనే ఓటేయండి

Mar 25,2024 21:36

ప్రజాశక్తి-మెరకముడిదాం : ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మంచి జరిగితేనే తమకు ఓటు వేయాలని, లేకుంటే వద్దని మంత్రి బొత్స సత్యనారాయణ ఓటర్లను కోరారు. సోమవారం మెరకముడిదాం మండలంలోని గాతాడ పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో కూడా జరగని అభివద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు వద్దకు తీసుకొచ్చిన ఘనత సిఎం జగన్‌దేనని చెప్పారు. మధ్యవర్తి, దళారీ వ్యవస్థ లేని పాలన సిఎం అందిస్తున్నారని తెలిపారు. ఐదేళ్లకోసారి ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే వారిని నమ్మొద్దని కోరారు. కార్యక్రమంలో జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, బొత్స సందీప్‌, మండల నాయకులు తాడ్డి వేణుగోపాలరావు, ఎస్‌వి రమణరాజు, కోట్ల వెంకటరావు, హరి బాబు, రాము, పి.కష్ణమూర్తి, సర్పంచ్‌ గిడిజాల భవాని శంకర్‌, బూర్లె నరేష్‌ కుమార్‌ పాల్గొన్నారు.
కోలగట్ల ఎన్నికల ప్రచారం
విజయనగరం టౌన్‌ : ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సేవ చేసిన వారిని ఎన్నికల్లో గెలిపించాలని డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి కోరారు. సోమవారం నగరంలోని దాసన్నపేటలోని యాత వీధి, నాగవంశం వీధి తదితర ప్రాంతాల్లో ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ పొంతపల్లి మాలతి, వైసిపి జోనల్‌ ఇన్‌ఛార్జి బొద్దాన అప్పారావు మాట్లాడుతూ నగరంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి కోలగట్ల వీరభద్ర స్వామి నేతృత్యంలో గత ఐదేళ్లలో జరిగిందన్నారు. పెద్ద పల్లెటూరిగా ఉన్న విజయనగరాన్ని కార్పొరేషన్‌ స్థాయికి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి మండలి డైరెక్టర్‌ బంగారు నాయుడు, మన్యాల కృష్ణ, గదుల సత్యలత, కార్పొరేటర్‌ ఆల్తి సత్యకుమారి, వైసిపి జోనల్‌ ఇన్‌ఛార్జి బోడసింగి ఈశ్వరరావు, మాజీ కౌన్సిలర్‌ కోరాడ సూర్య ప్రభావతి పాల్గొన్నారు.

➡️