రైతులకు మద్దతుగా నిరసన

Feb 22,2024 20:40

ప్రజాశక్తి-బొబ్బిలిరూరల్‌ : ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఎపి రైతుసంఘం జిల్లా అధ్యక్షులు ఎస్‌.గోపాలం ఆధ్వర్యాన గురువారం మండలంలోని రంగరాయపురంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గోపాలం మాట్లాడుతూ చలో ఢిల్లీ కార్యక్రమంలో రైతులపై రబ్బరు బుల్లెట్లతో దాడి, లాఠీఛార్జిని తీవ్రంగా ఖండించారు. యువరైతును మోడీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం దేశంలో అదాని, అంబానీకి వ్యవసాయాన్ని కట్టబెట్టాలనే కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో మోడీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మోడీ పంచన చేరే పార్టీలను ఓడించాలని కోరారు. రైతులను దగా చేస్తున్న ఏ ప్రభుత్వమైనా మట్టిలో కలిసిపోతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం నాయకులు ప్రసాద్‌, భూషణం, సాంబయ్య, సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకర్రావు రైతులు పాల్గొన్నారు.

➡️