అంబేద్కరునికి పాలాభిషేకం

Jan 19,2024 15:05 #Vizianagaram
anganwadi workers strike 39th day vzm s

చేసిన చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : శుక్రవారం విజయవాడలో బి.ఆర్. అంబేద్కర్ 206 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరుగుతున్న సంధర్భంగా విజయనగరం ధర్మ పురి స్థానిక అంబేద్కర్ కాలనీలో ఇటీవలే నిర్మించిన మజ్జి శ్రీనివాస రావు (చిన్న శ్రీను) స్వంత నిధులతో నిర్మించిన బాబా సాహెబ్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఘనంగా పూల మాలలు జిల్లా పరిషత్ ఛైర్మన్ వై.యస్.ఆర్ .సీ.పీ. జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాస రావు (చిన్నశ్రీను) కుమార్తె చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) వేశారు. ఈ సంధర్భంగా సిరి సహస్ర మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారని గతంలో కోన సీమ జిల్లాని అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టారన్నారు. నేడు విజయవాడ లో అత్యంత భారీ ఏర్పాట్లతో మన రాష్ట్రం గర్వించే విధంగా అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ చేయడం చాలా ఆనంద దాయకమైన విషయం అని అన్నారు. ఇదే విధంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం మన అందరం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో చిన శ్రీను సోల్జర్స్ ఉప అధ్యక్షులు తోట వాసు,కార్యదర్శి జాకీర్ హుస్సైన్,రామకృష్ణ,శ్రీనివాస్,జగదీష్,శివ,అభిరామ్,దక్షిణామూర్తి, మరియు స్థానిక దళిత సంఘాలనాయకులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️