జనవరి 3 చలో కలెక్టరేట్ ముట్టడి

Jan 1,2024 14:30 #Vizianagaram
anganwadi workers strike 21 day vzm

ప్రజాశక్తి-విజయనగరం : అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి జనవరి 3 చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ , రామ్మూర్తి నాయుడు రాజాం తాసిల్దార్ కార్యాలయం వద్ద జరుగుతున్న సమ్మె శిబిరంలో పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత 21 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న ప్రభుత్వం పరిష్కారం చేయకుండా సమస్యను జట్లం చేస్తుందని, అంగన్వాడీలకు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యువిటీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ చేస్తున్న పోరాటం రాష్ట్ర ప్రభుత్వానికి పరిష్కారం చేయాలనే ఆలోచన కంటే విచ్చన్నం చేయాలని ఆలోచన రోజురోజుకీ పెరుగుతుందని దీన్ని మార్చుకోవాలని, ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే అంగన్వాడీ ఉద్యమం కూడా జగముండిగా ఉద్యమాలు నిర్వహిస్తారని హెచ్చరించారు, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేయాలని లేదంటే ఈ పోరాటం ఉద్యమ రూపం మారుతుందని హెచ్చరించారు.

1) అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలి. ముఖ్యమంత్రిగారు హామి ఇచ్చిన విధంగా తెలంగాణా కన్న అదనంగా వేతనాలు పెంచాలి.

2) సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు మన రాష్ట్రంలో కూడా గ్రాడ్యూటీ అమలు చేయాలి.

3) రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ సెంటర్లన్ని తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చాలి. మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి.

4) రిటైర్మెంట్ బెపిఫిట్ 5 లక్షలకు పెంచాలి. ఆఖరి వేతనంలో 50% పెన్షన్ ఇవ్వాలి.

5) హెల్పర్ల ప్రమోషన్లో నిర్ధిష్టమైన నిబంధనలు రూపొందించాలి. రాజకీయజోక్యం అరికట్టాలి.

6) సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. 10 లక్షలు బీమా అమలు చెయ్యాలి.

7) వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం ఇవ్వాలి.

8) లబ్దిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. ఎస్ఆర్ఎస్ రద్దుచెయ్యాలి. ప్రీస్కూల్ బలోపేతం చెయ్యాలి. 9) ఎస్ఆర్ఎస్ మరియు వివిధ రకాల యాప్ లను రద్దు చేసి ఒక యాప్ ద్వారా విధులు నిర్వహించే విధంగా చేయాలి.

10) వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలి. గ్యాసును ప్రభుత్వమే సరఫరా చెయ్యాలి.

11) పెండింగ్లో ఉన్న సెంటర్అద్దెలు, 2017 నుండి టిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలి.
12) పెండింగ్లో ఉన్న గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్ట్ 164ను వెంటనే భర్తీ చేయాలి. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీదేవి జయలక్ష్మి వనజ మంగమ్మ చిన్న తల్లి సత్యవతి పార్వతి ఈశ్వరమ్మ మీనా జయమ్మ మాలతి మొదలగువారు పాల్గొన్నారు

➡️