సోది చెబుతూ అంగన్వాడీల నిరసన

Jan 1,2024 16:08 #Vizianagaram
anganwadi workers strike 21 day vzm protest

కొత్త సంవత్సరంలో నైనా ముఖ్యమంత్రి జీతాలు పెంచాలని డిమాండ్ చేసిన జిల్లా అధ్యక్షులు పైడిరాజు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కొత్త సంవత్సరంలో ముఖ్యమంత్రి మనసు మారి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు వేతనాలు పెంచాలని కోరుతూ కేక్ కట్ చేసి,అనంతరం సోది చెప్పి నిరసన వ్యక్తం చేశారు. సోది చెబుతూ రాధా అనే అంగన్వాడీ వర్కర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెక్పర్సు యూనియన్ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు సమ్మె చేపట్టి 21 రోజులు అవుతున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. మా వేతనాలు పెంచి,గ్రాట్యుటీ చెల్లించే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. కొత్త సంవత్సరంలో నైనా ముఖ్యమంత్రి స్పందించి మాకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారం కోసం స్పష్టమైన హామీ ఇచే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు ఏ.జగన్మోహన్, సుశీల, ఉష అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️