రహదారి మరమ్మత్తులెప్పుడు

Jan 27,2024 11:06 #Vizianagaram
cpm demand road repair

ప్రజాశక్తి-రాజాo  : రాజాo మండలం కొత్త కంచరాం నుండి దోసరి గ్రామానికి వెళ్లే. ఆర్ అండ్ బి రహదారిని తక్షణమే మరమ్మత్తులు చేయాలని సిపిఎం శాఖా కార్యదర్శి దోసరి గ్రామంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శంకర్రావు మాట్లాడుతూ కొత్త కంచరం నుండి దోసర వెళ్లే రహదారి పూర్తిగా పాడైపోయిందని అనేక ప్రమాదాలకు ఆస్కారంగా ఈ రోడ్డు ఉన్నదని అధికారులు ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోలేకపోవడం సరైనది కాదని, రోడ్లు పూర్తిగా పాడైపోవడంతో ప్రయాణం చేసిన వాళ్ళు భయంతో ప్రయాణం చేయవలసిన పరిస్థితి వస్తుందని, ఆర్ అండ్ బి అధికారులకు గతంలో వినతి పత్రాలు ఇచ్చిన కూడా కనీసం స్పందించడం లేదని తీవ్రంగా విమర్శించారు. తక్షణమే రహదారి మరమత్తులు చేపట్టకపోతే సిపిఎం పార్టీ ప్రజానీకాన్ని కూడగట్టి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు అప్పల రామ్, సింహాచలం, ఆదినారాయణ, శంకర్రావు, ఎర్రయ్య, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

➡️