నిర్ణీత సమయానికి భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం

May 20,2024 19:28 #airport, #construction, #CS
  • పనులను పరిశీలించిన సిఎస్‌ జవహర్‌రెడ్డి

ప్రజాశక్తి-భోగాపురం (విజయనగరం జిల్లా) : భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని జిఎంఆర్‌ ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ కెఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదేశించారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణ పనులను ఆయన సోమవారం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ భవనం, రన్‌వే, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సెంటర్‌ భవనాలు, ఇతర నిర్మాణ పనులను సందర్శించారు. ఎయిర్‌పోర్టు ప్లాన్‌ను పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించిన అంశాలను సిఎస్‌కు జిఎంఆర్‌ ప్రతినిధులు వివరించారు. ఇప్పటివరకు చేపట్టిన పనుల పట్ల జవహర్‌రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌, ఆర్‌డిఒ ఎంవి సూర్యకళ, తహశీల్దార్‌ శ్యామ్‌ ప్రసాద్‌, జిఎంఆర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ సిఇఒ మనోమరు రారు, ప్రాజెక్టు హెడ్‌ బిహెచ్‌.ఎ.రామరాజు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️