నగరంలో ఎన్నికల కర్ఫ్యూ

May 13,2024 22:28

విజయనగరం టౌన్‌ : నగరంలో ఎన్నికల కర్ఫ్యూ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో సోమవారం నగరంలోని రహదారులు, మార్కెట్లు బోసిపోయాయి. షాపులు సైతం మూతపడడంతో నగరంలో నిర్మానుష వాతావరణం నెలకొంది. ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని షాపులకు సెలవు ప్రకటించడంతో మార్కెట్లలో షాపులన్నీ మూతపడ్డాయి. నిత్యం వేలాదిమంది తో రద్దీగా ఉండే గంటస్తంబం జంక్షన్‌,ఎంజి రోడ్డు, కలెక్టరేట్‌ ప్రాంతం, బాలాజీ జంక్షన్‌, కోట జంక్షన్‌ ప్రాంతాలు నిర్మునుష్యంగా మారాయి. జనం లేక రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి. నిర్మానుష్యంగా రహదారులు బొబ్బిలి : పట్టణ రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఎన్నికలు జరగడంతో పట్టణంలో నివసించే ఉద్యోగులు, కార్మికులు ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు వెళ్లారు. పట్టణ ప్రజలు కూడా ఓటు వేసి ఎండ తీవ్రతకు బయటకు వచ్చేందుకు భయపడడంతో పట్టణ రోడ్లు కర్ఫ్యూను తలపించాయి.

➡️